telugu navyamedia
క్రైమ్ వార్తలు

దాసరి నారాయణరావు కొడుకు అరుణ్ అరెస్ట్..

దివంగత దాసరి నారాయణ రావు చిన్న కుమారుడు..సినీనటుడు దాసరి అరుణ్‌కుమార్‌పై హైదరాబాద్​ బంజారాహిల్స్‌ పోలీస్​స్టేషన్‌లో కేసు నమోదైంది.

గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో తప్పతాగి  బంజారాహిల్స్ రోడ్‌ నెంబర్ 12లోని పోలీస్ స్టేషన్‌ పరిధిలోని సయ్యద్ నగర్ లో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రెండు ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టాడు. అక్కడితో ఆగకుండా.. మరింత వేగంతో దూసుకెళ్లాడు.

Dasari Narayana Rao, filmmaker and former minister, passes away - The Hindu

బాధితుల ఫిర్యాదు మేరకు  అదే ప్రాంతంలో ఉన్న పెట్రోలింగ్​ పోలీసులు అరుణ్​కుమార్​ కారును.. వెంబడించి పట్టుకున్నారు. ఆ సమయంలో అతడు మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. 

Case Filed Aganist Dasari Arun Kumar At Banjarahills Ps - Sakshi

అరుణ్​కుమార్​ను అదుపులోకి తీసుకున్న పోలీసులు బ్రీత్ ఎన్‌లైజర్ టెస్ట్ చేయగా మద్యం సేవించినట్టు నిర్ధరణ అయ్యింది. దీంతో అరుణ్‌పై 185, 336 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. యాక్సిడెంట్‌కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ అధారంగా దర్యాప్తు జరుపుతున్నారు

Related posts