telugu navyamedia
క్రైమ్ వార్తలు

చైనాలో ఘోర విమాన ప్రమాదం..

చైనాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. చైనా ఈస్టర్న్‌ కంపెనీకి చెందిన బోయింగ్ 737 విమానం కుప్పకూలింది. ఈ విమానంలో ప్రయాణిస్తున్న 133మంది మరణించారు. కన్ మింగ్ నుంచి వెళ్తుండగా గ్వాంగ్జీ ప్రాంతంలోని వూఝౌ నగర సమీపంలోని పర్వత ప్రాంతంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. విమానం కూలిన వెంటనే అందులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

భారీగా ప్రాణనష్టం ఉంటుందని స్టేట్ బ్రాడ్‌కాస్టర్ సీసీటీవీ సోమవారం తెలిపింది. సమాచారం తెలుసుకున్న అధికారులు వెంటనే రెస్క్యూ టీమ్స్ ను సంఘటనా స్థలానికి పంపినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

MU5736 విమానం గ్వాంగ్‌జౌలో మధ్యాహ్నం 1 గంటకు బయల్దేరగా.. అది మధ్యాహ్నం 3.05 గంటలకు కున్ మింగ్ కు చేరాల్సి ఉంది. అయితే మార్గమధ్యంలో విమానం కూలిపోయింది.

కాగా ..2015లో MU5736 విమానాన్ని బోయింగ్ సంస్థ చైనా ఈస్టర్న్ కంపెనీకి డెలివరీ చేసింది. బోయింగ్ 737 ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన విమానాలలో ఒకటి. చైనా ఈస్టర్న్ కంపెనీ 737-800, 737 మాక్స్‌తో సహా సాధారణ విమాన సేవలను సైతం అందిస్తోంది.

Related posts