telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సరూరనగర్‌ లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో జరిగిన కిడ్నీ రాకెట్‌పై విచారణకు ఆదేశించిన దామోదర్ రాజ నరసింహ

సరూరనగర్‌ లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో జరిగిన కిడ్నీ మార్పిడి రాకెట్‌ పై సమగ్ర విచారణ జరిపించాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నరసింహ మంగళవారం ఆరోగ్యశాఖ సీనియర్‌ అధికారులను ఆదేశించారు.

సరూర్‌నగర్‌ లోని అలకనంద ఆసుపత్రిలో రాచకొండ పోలీసులు, జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు జరిపిన దాడుల నేపథ్యంలో మంగళవారం సాయంత్రం జరిగిన సమీక్షా సమావేశంలో వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.

క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం ప్రకారం హైదరాబాద్ మరియు జిల్లాల్లోని ప్రైవేట్ హెల్త్‌కేర్ సదుపాయాలలో తనిఖీలను ముమ్మరం చేయాలని ఆరోగ్య మంత్రి ఆరోగ్య అధికారులను ఆదేశించారు.

Related posts