telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణ లాక్‌డౌన్‌ పై ఫేక్ జీవో వివాదం…

lockdown corona

తెలంగాణలో లాక్‌డౌన్ విధించారంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరిగింది.. ఏకంగా ప్రభుత్వ ఉత్తర్వులనే నకిలీ తయారు చేసి షేర్ చేయడంతో.. అదికాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే, ఆ వెంటనే అధికారులు, పోలీసులు.. లాక్‌డౌన్ లేదంటూ క్లారిటీ ఇచ్చినా.. అప్పటికే ఫేక్ న్యూస్ మాత్రం చక్కర్లు కొట్టింది.. దీంతో.. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు.. ఫేక్ జీవో తయారు చేసిన వ్యక్తి కోసం గాలించారు.. చివరకు ఆ పనిచేసిన నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీపతి సంజయ్ కుమార్‌ను అరెస్ట్ చేశారు.. బిజినెస్ డిటేల్స్ హైదరాబాదులో చార్టెడ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న సంజయ్‌ కుమార్…  కార్వే కన్సల్టెన్సీలో కూడా చార్టర్డ్ అకౌంటెంట్ గా పనిచేసినట్టు చెబుతున్నారు. అయితే, లాక్‌డౌన్ పేరుతో నకిలీ జీవో తయారు చేసిన ఆయన.. తాను ఉన్న గ్రూప్‌లో పోస్ట్ చేశాడు.. దాంతో.. అది షేరింగ్‌, ఫార్వర్డ్‌లతో ఇతర గ్రూపుల్లోకి ప్రవేశించింది.. లాక్‌డౌన్‌ జీవో ఫేక్ అని తెలియని ప్రజలు.. భయాందోళనకు గురికావడని కారణం అయ్యాడని చెబుతున్నారు సీపీ అంజనీ కుమార్.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి.. నిందితుడిని పట్టుకున్నట్టు వెల్లడించారు.

Related posts