దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. అయితే కరోనా కేసులు భారీగా వస్తున్న సమయంలో చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. అయితే ఇప్పుడు కేసులు తగ్గుతున్న ముందు జాగ్రత్తగా దానిని కొనసాగిస్తున్నాయి. అయితే ఈ జాబితాలో ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ కూడా చేరిపోయింది. కరోనా కట్టడి కోసం విధించిన కర్ఫ్యూను మరోసారి పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. మే 1వ తేదీ నుంచి ప్రారంభమైన ఆంక్షలు.. ఇవాళ్టితో ముగియనుండగా.. మరో 10 రోజులు పాటు కర్ఫ్యూను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం.. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే వివిధ అవసరాల నిమిత్తం సడలింపులు ఉండగా.. ఆ సమయాన్ని కూడా యథాతథంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చూడాలి మరి తర్వాత ఏం జరుగుతుంది అనేది.
							previous post
						
						
					
							next post
						
						
					

