ఎన్డీఏ పక్షాలన్నీ మద్దతుగా నిలవగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా CP రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేశారు.
రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్ర మోదీకి నామినేషన్ పత్రాలు అందజేశారు CP రాధాకృష్ణన్. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయన మొదటి ప్రతిపాదకుడిగా నిలిచారు.
నామినేషన్ దాఖలు కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా సహా పలు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతలు పాల్గొన్నారు.
పార్లమెంట్ ఆవరణలో ఉన్న ప్రముఖుల విగ్రహాలకు నివాళి అర్పించిన రాధాకృష్ణన్ అనంతరం నామినేషన్ దాఖలు చేశారు.

