telugu navyamedia
రాజకీయ

ఉక్రెయిన్ రైల్వే స్టేషన్​పై రష్యా దాడులు…30 మంది మృతి..100 మందికి తీవ్ర‌గాయాలు..

*ఉక్రెయిన్ రైల్వే స్టేషన్​పై రష్యా రాకెట్ దాడి.. సామాన్య పౌరులు మృతి

*30 మందికి మృతి..100 మందికి

పైగాతీవ్ర‌గాయాలు..

ఉక్రెయిన్ పై ర‌ష్యా మ‌ళ్లీ బాంబుల వ‌ర్షం కురిపించింది. గత నెల 24న ఉక్రెయిన్‌పై ‘మిలిటరీ ఆపరేషన్’ పేరుతో ప్రారంభించిన రష్యా వాటిని కొనసాగిస్తోంది. ర‌ష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేటితో 44 రోజులు అవుతుంది.

ఉక్రెయిన్‌లోని రైల్వే స్టేషన్‌పై రష్యా రెండు రాకెట్లతో విరుచుకుపడింది. రష్యా రాకెట్ దాడి లో 30 మందికిపైగా అక్కడికక్కడే మ‌ర‌ణించారు. మరో 100 మంది గాయపడ్డారు. ఉక్రెయిన్‌లోని తూర్పు ప్రాంతంలోని క్రమాటోర్​స్క్​లోని రైల్వే స్టేషన్​పై శుక్రవారం ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

క్రామటోర్స్క్ రైల్వే స్టేషన్ ను సాధారణ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వినియోగిస్తున్నామని పేర్కొంది. ఈ నేపథ్యంలో మృతుల్లో ఎక్కువ మంది సామాన్యులే ఉంటారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు.

రష్యా యుద్ధ నేరగాళ్లు తమ పౌరులను ఉద్దేశపూర్వకంగానే లక్ష్యంగా చేసుకుంటున్నారని, భారీస్థాయిలో విధ్వంసం సృష్టించే క్లస్టర్ బాంబులను కూడా ఉపయోగిస్తున్నారని ఆరోపించింది.

ఈ దాడికి సంబంధించిన ఫొటోలను కూడా ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. రక్తపు మడుగుల్లో మృతదేహాలు పడివున్న తీరు భయానకంగా ఉందని తెలిపింది..

మ‌రోవైపు ఉక్రెయిన్‌లో సాధారణ పౌరుల హక్కులను దారుణంగా అణచివేసినందుకు.. ఐక్యరాజ్య సమితి (యూఎన్‌) మానవ హక్కుల మండలి సభ్యత్వం నుంచి రష్యా సస్పెన్షన్‌కు గురైంది.

Related posts