telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

ఏపీలో 80 వేలు దాటిన కరోనా కేసులు

corona vairus

ఏపీలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరించడంతో అక్కడ రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇవాళ ఒక్కరోజే 8,147 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 80,858కి చేరింది. అన్ని జిల్లాల్లో భారీగా కొత్త కేసులు గుర్తిస్తున్నారు.

రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో కొత్తగా 1029 మందికి కరోనా సోకినట్టు తేలింది. ఇక, మరణాల సంఖ్య కూడా భారీగానే నమోదైంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 49 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దాంతో కరోనా మృతుల సంఖ్య 933కి చేరింది.

Related posts