ఢిల్లీలోని గాజిపూర్ కూరగాయల మార్కెట్ లో సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీకి పాజిటివ్ గా నిర్దారణ అయింది. సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీకి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. ఇద్దరికీ పాజిటివ్ రావడంతో మార్కెట్ ను రెండు రోజుల పాటు మూసివేసినట్లు మార్కెట్ ఛైర్మన్ ఎస్పీ గుప్తా తెలిపారు.
ఇద్దరితో సన్నిహితంగా ఉన్న వారి వివరాలు సేకరించి..అందరినీ క్వారంటైన్ లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఢిల్లీలో కేంద్రం ఆదేశాల మేరకు మూడో దశ లాక్ డౌన్ కొనసాగుతుండగా..కంటైన్ మెంట్ జోన్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చింది.