telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఒక్క ఏడాదిలోనే రేవంత్ రెడ్డి నిజస్వరూపం బట్టబయలు: ఈటల రాజేందర్

మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్‌ గురించి తెలియడానికి తొమ్మిదేళ్లు పట్టింది, సీఎం రేవంత్‌రెడ్డి నిజస్వరూపం ఒక్క ఏడాదిలోనే తేలిపోయిందని అన్నారు.

ప్రజలు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలను నమ్మరని, బీజేపీని మాత్రమే విశ్వసిస్తున్నారని ఆయన అన్నారు. ఆదివారం గజ్వేల్‌ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఈటల పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్‌లో తమ పార్టీని ఓడించలేమని చెప్పిన కేసీఆర్‌ను గత లోక్‌సభ ఎన్నికల్లో తమ జిల్లా ప్రజలే ఓడించారన్నారు.  నాతో పాటు చాలా మంది బీసీ నేతలను బయటకు పంపిన పార్టీ బీఆర్‌ఎస్ అని అన్నారు.

బీఆర్‌ఎస్ పార్టీ ఆ పార్టీలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలకు అవకాశాలు కల్పిస్తే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు అన్నారు.

కేసీఆర్ కుటుంబానికి బీసీ అనే పదం చెప్పే అర్హత లేదు అని అన్నారు . అణగారిన వర్గాల గురించి ఆలోచించే ఏకైక పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను ప్రజలు ఆశీర్వదిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Related posts