ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 41,773 కరోనా టెస్టులు నిర్వహించగా 878 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఏపీలో 13 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 13,838కి చేరింది. ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,13,001కి చేరింది. ఇందులో 19,84,301 మంది ఇప్పటికే కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో ఏపీలో 1182 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 14,862 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి.గత 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో 255, తూర్పుగోదావరి జిల్లాలో 166, ప్రకాశం జిల్లాలో 96, గుంటూరులో 85, కడపలో 67, నెల్లూరులో 61, విశాఖపట్నంలో 50, కృష్ణాజిల్లా 42, శ్రీకాకుళం జిల్లాలో 24 కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 2.65 కోట్లకు పైగా కరోనా టెస్టులు నిర్వహించారు.


అమరావతిలో అవినీతి జరిగితే విచారణ చేసుకోవచ్చు: ఎమ్మెల్యే గంటా