*రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
*గౌతమ్‌రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం జగన్
*గౌతమ్‌రెడ్డి మరణం రాష్ర్టానికి తీరని లోటు మంత్రి అనిల్..
*సభలో కన్నీటి పర్యంతమైన రోజా..
ఏపీ రెండో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ప్రారంభం అయ్యాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్ గౌతమ్‌రెడ్డి సంతాపం తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు.మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం తనను కలచి వేసిందని, ఆయన మృతి తనకు వ్యక్తిగతంగా తీరని లోటని జగన్ అన్నారు.
మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ తాను ఈ వార్త విని షాక్ కు గురయ్యానని చెప్పారు. తొలుత ఈ వార్తను తాను నమ్మలేదన్నారు. వివాదాలు లేని వ్యక్తి మేకపాటి గౌతమ్‌రెడ్డి. ఎలాంటి ఇగో లేని వ్యక్తి. గౌతమ్‌రెడ్డి సంతాప తీర్మానంపై మాట్లాడాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు.
2010 నుంచి సన్నిహితగా మెలిగామంటూ వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తు చేసుకున్న మంత్రి అనిల్. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు ప్రసంగించాడు మంత్రి అనిల్.
గౌతమ్‌రెడ్డి సంతాప తీర్మానంపై మాట్లాడాల్సి రావడం దురదృష్టకరం అని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ప్రజల మెప్పు మాత్రమే కాదు.. తోటి రాజకీయ నేతల మెప్పుకూడా పొందిన వ్యక్తి అని రోజాభావోద్వేగానికి గురైయ్యారు.. అజాతశత్రువు ఆయన..ప్రతిపక్షాల మెప్పు సైతం పొందిన వ్యక్తి. జగనన్నకి నిజమైన సైనికుడు గౌతమ్‌రెడ్డి అని రోజా గుర్తు చేసుకున్నారు.
ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూఎన్ని బాధ్యతలు నిర్వహించినా.. వివాదాలు లేకుండా సమర్థవంతుడిగా పేరుంది గౌతమ్ రెడ్డికి. ఆయన లేని లోటు తీరనిదని అన్నారు.