తెలంగాణ సీఎం కేసీఆర్ పై ని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. సీఎం జగన్‌ను ప్రగతి భవన్‌లోకి ఎలా రానిచ్చారు? అని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్ ను ప్రశ్నించారు. కేసీఆర్, జగన్ కూర్చొనే పోతిరెడ్డిపాడు విస్తరణ పనులకు జీవో ఇచ్చారని ఆరోపించారు. పద్ధతి ప్రకారం దక్షిణ తెలంగాణను ఎండబెట్టే కుట్ర జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణను ఎడారిగా మార్చే 203 జీవోను వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు. జీవోకు కారణం.. తెలంగాణ ద్రోహి కేసీఆరేనని ధ్వజమెత్తారు. కాళేశ్వరంలో 90 శాతం పనులు పూర్తి చేసిన కేసీఆర్.. దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయడం లేదని నిలదీశారు. దీనిపై అడిగే దమ్ము టీఆర్‌ఎస్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలకు లేదని కోమటిరెడ్డి ఎద్దేవాచేశారు. శాసనమండలి చైర్మన్ ఒక రాజకీయ బ్రోకర్ అంటూ మండిపడ్డారు. కేసీఆర్ తన పక్కన బ్రోకర్లను పెట్టుకుని మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.

