జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలనుఓడించాలని ఎంపీ ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు.
దేశం సురక్షితంగానూ, సుభిక్షంగానూ ఉండాలంటే మోదీ ప్రధానిగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.
కృష్ణానగర్ ఏ, బీ బ్లాక్‌లలో బీజేపీ అభ్యర్థి లంకాల దీపక్‌రెడ్డి గెలుపును కాంక్షిస్తూ మంగళవారం ఆయన ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమం కావాలంటే బీజేపీకి ఓటు వేయాలన్నారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు సోప్‌టాప్ గాళ్లని, వాళ్ల మీద ప్రజలకు విశ్వాసం లేదని విమర్శించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఉపఎన్నికలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు బుద్ధి చెప్పాలని బీజేపీ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య పిలుపునిచ్చారు.
బీజేపీ అభ్యర్థి లంకాల దీపక్‌రెడ్డికి మద్దతుగా వెంగళరావునగర్ డివిజన్‌లోని ఏజీ కాలనీ, లక్ష్మీనగర్ తదితర ప్రాంతాల్లో ఆయన ప్రచారం చేశారు.
పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ, గడిచిన రెండు సంవత్సరాలుగా రాష్ర్టాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరించారు.
వెంగళరావునగర్ కాలనీలో మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, జవహర్ నగర్‌లో బండారు విజయలక్ష్మి పాదయాత్ర నిర్వహించారు.
కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ఎస్.రామచంద్రారెడ్డి, జయశ్రీ, స్థానిక నాయకులు నవీన్, సుప్రియాగౌడ్, శివ, శ్రీకాంత్, సురేష్, కిట్టు పాల్గొన్నారు.

