ప్రపంచ ఉద్యమాల చరిత్రలోనే తెలంగాణ సాయుధ పోరాటం ఒక గొప్ప మైలురాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించిన ప్రజా పాలన దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం జాతీయ జెండా ఆవిష్కరించారు.
అనంతరం సభలో ప్రసంగిస్తూ తెలంగాణ ఉద్యమ చరిత్ర, మహిళల పాత్ర, అభివృద్ధి లక్ష్యాలపై మాట్లాడారు.
తెలంగాణ సాయుధ పోరాటంలో మహిళల పాత్ర మరువలేనిదని గుర్తుచేస్తూ, “మహిళల అభివృద్ధికి మేం అండగా నిలుస్తాం.
కోటి మందిని కోటీశ్వరులుగా చేయడం మా లక్ష్యం” అని సీఎం రేవంత్ తెలిపారు. తెలంగాణను స్వేచ్ఛ, సమానత్వంలో రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు.
విద్య మాత్రమే భవిష్యత్తుకు దారి చూపే మార్గమని, అందుకే ప్రపంచ స్థాయి విద్యా అవకాశాల కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెట్టుబడులు పెడుతోందన్నారు.
యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణానికి అయ్యే ఖర్చును ఎఫ్‌ఆర్‌బీఎం నుంచి మినహాయించాలని కేంద్రాన్ని కోరారు. క్రీడల అభివృద్ధికీ అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపారు.
రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని, 48 గంటల్లోనే డబ్బులు రైతుల ఖాతాల్లో జమవుతున్నాయని సీఎం తెలిపారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో బిల్లు ఆమోదించి, ఇప్పుడు కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నామని వెల్లడించారు.
కృష్ణా, గోదావరి నదుల జలాల్లో తెలంగాణ వాటాకు సంబంధించి రాజీపడేది లేదని స్పష్టం చేసిన సీఎం, “మన వాటా కోసం న్యాయపోరాటం కొనసాగుతోంది. ఇది తెలంగాణ ప్రజల హక్కు” అని అన్నారు.
హైదరాబాద్‌ను గేట్ ఆఫ్ వరల్డ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. మూసీ నదిని ప్రక్షాళన చేసి, పరివాహక ప్రజలకు మెరుగైన జీవితం కల్పించనున్నామని, ప్రపంచ స్థాయి నిర్మాణాలతో మూసీని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రణాళికను వెల్లడించారు.
ఈ ప్రాజెక్టుకు డిసెంబర్‌లో శ్రీకారం చుడతామన్నారు. 30 వేల ఎకరాల్లో “ఫ్యూచర్ సిటీ” నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.
రాష్ట్రంలో దుర్మార్గం రాజ్యమేలుతోంది: లోకేశ్