ఏపీ సీఎం జగన్ ఈ రోజు తన క్యాంపు కార్యాలయం నుంచి ‘వైఎస్సార్ ఆసరా’ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పసిపిల్లల నుంచి బామ్మల వరకు అందరికీ ప్రయోజనాలు చేకూరేలా తాము సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. . 87 లక్షల మంది మహిళలకు రూ.27వేల కోట్ల రుణాలున్నాయని గుర్తు చేశారు. అలాగే పీ అండ్ జీ, హెచ్‌యూఎల్ లాంటి మల్టీనేషనల్ కంపెనీల ద్వారా మహిళలకు చేయూతనిస్తామని తెలిపారు.
రాష్ట్రంలోని 8,71,302 పొదుపు సంఘాల్లో 87,74,674 మంది మహిళల పేరుతో బ్యాంకుల్లో ఉన్న అప్పు రూ.27,168.83 కోట్లను ప్రభుత్వం నాలుగు విడతల్లో జమ చేస్తుంది. ఈ మేరకు తొలి విడతలో భాగంగా రూ.6,792.20 కోట్లను జమ చేశారు. ఈ డబ్బు మొత్తాన్ని ఎలా ఖర్చు చేసుకోవాలన్న నిర్ణయాన్ని మహిళలకే వదిలేస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. బ్యాంకర్లు ఆ మొత్తాన్ని పాత అప్పులకు మినహాయించుకోకూడదని ప్రభుత్వం ఆదేశించింది.


40 రోజుల తర్వాత రీపోలింగ్ ప్రజాస్వామ్య విరుద్దం: లోకేష్