telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

ప్రతి ఘట్టంలోనూ తండ్రే తనకు స్ఫూర్తి: సీఎం జగన్

jagan rajashekar reddy

ఈ రోజు ప్రపంచ ఫాదర్స్ డే సందర్భంగా ఏపీ సీఎం జగన్ ఆయన ట్విట్టర్ లో స్పందించారు. జీవితంలోని ప్రతి ఘట్టంలోనూ తండ్రే తనకు స్ఫూర్తి, బలం అని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రతి తండ్రి తన పిల్లల గెలుపు కోసం ప్రయత్నిస్తారని తెలిపారు.

పిల్లలకు ప్రేమను, స్ఫూర్తిని నాన్నే పంచుతారని తెలిపారు. నాన్నే మనకు తొలి గురువు, స్నేహితుడు, హీరో అని జగన్ వివరించారు. మన సంతోషాలన్నీ ఎక్కువగా నాన్నతోనే పంచుకుంటామని పేర్కొన్నారు. ప్రతి తండ్రికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.

Related posts