బెంగళూరు నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
కాసేపట్లో కుప్పం చేరుకోనున్న సీఎం చంద్రబాబు.
రెండు రోజుల పాటు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన
కుప్పంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న సీఎం.
కొత్తగా మంజూరైన పెన్షన్లను లబ్దిదారులకు అందచేయనున్న సీఎం.
1000 మంది దీపం పథకం లబ్దిదారులకు గ్యాస్ కనెక్షన్లు ఇవ్వనున్న చంద్రబాబు.
శాంతిపురం మండలం తుంశీలోని ఏపీ మోడల్ స్కూల్ వద్ద బహిరంగ సభకు హాజరు కానున్న సీఎం
బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్న సీఎం
కుప్పం నియోజకవర్గం అభివృద్ధి, నైపుణ్య శిక్షణకు సంబంధించి నాలుగు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్న ప్రభుత్వం
కుప్పంలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి రూ.1617 కోట్ల విలువైన పెట్టుడులపై ఒప్పందాలు
తిమ్మరాజు పల్లిలో సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించనున్న సీఎం.
ఉద్యోగ సంఘాలకు మాట్లాడే పరిస్థితి లేదు: జీవన్‌రెడ్డి