telugu navyamedia
తెలంగాణ వార్తలు

చేతికి ఎముక లేని తనానికి ట్రేడ్ మార్క్ లాంటి వారు కేసీఆర్..

తెలంగాణ హైకోర్టులో రెండేళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యల  పరిష్కారం కోసం తన శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నానని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్‌.వి.రమణ చెప్పారు.న్యాయాధికారులు భయం లేకుండా తమ పని తాము చేయాలని ఆయన సూచించారు.జిల్లా కోర్టుల్లోనూ జడ్జిల సంఖ్య పెంచుతున్నామన్నారు. 

హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్‌లో నిర్వహించిన తెలంగాణ న్యాయాధికారుల సదస్సు- 2022లో ముఖ్య అతిథులుగా సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పాల్గొన్నారు.

ఈ స‌ద‌స్సులో పాల్గొన్న‌ జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ…తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని అన్నారు. చేతికి ఎముక లేని తనానికి ట్రేడ్ మార్క్ లాంటి వారు కేసీఆర్ అని కొనియాడారు.

తెలంగాణలో న్యాయ వ్యవస్థ అగ్ర పథాన ఉండాలని ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ పడుతున్న తపనకు, ఆయన వరాలజల్లుకు ధన్యవాదాలు తెలిపారు. న్యాయవ్యవస్థలో దాదాపు 4,320 ఉద్యోగాల్ని కేసీఆర్ క్రియేట్ చేశారని గుర్తు చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో న్యాయ వ్యవస్థకు ఏం అవసరమో అన్నీ సమకూర్చుతున్నారని సీజేఐ ఎన్వీ రమణ కొనియాడారు. తెలంగాణ హైకోర్టులో బెంచ్‌లను 24 నుంచి 41కి పెంచామని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత మొదటిసారి ఇలాంటి సదస్సు నిర్వహించుకుంటున్నామని, అందుకు ఆనందంగా ఉందని అన్నారు

ప్రత్యామ్నాయ విధానం కోసం ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ లాంటిదాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం, అందుకు స్థలం, నిధులు కేటాయించినందుకు కూడా ధన్యవాదాలు తెలిపారు. అది కేసీఆర్ వల్లే సాధ్యమని, దాని ఏర్పాటు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు.

 

Related posts