మెగాస్టార్ హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ హిట్ మూవీ వేదాళం రీమేక్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరో చెల్లెలి పాత్ర చాలా కీలకం. చిరంజీవి చెల్లెలిగా నటించబోయే నటి కోసం మొదట సాయి పల్లవి పేరు వినిపించింది. ఆ తరవాత కీర్తి సురేష్ పేరు మీడియాలో వినిపించింది. అయితే తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తోన్న సమాచారం ప్రకారం కీర్తి సురేష్‌ను చిరంజీవి ఫైనల్ చేశారు. ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై సీనియర్ నిర్మాత కె.ఎస్.రామారావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తమిళంలో శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వేదాళం’ రీమేక్ హక్కులను కె.ఎస్.రామారావు ఎప్పుడో కొనుగోలు చేశారు. ఈ సినిమాను చిరంజీవితోనే చేయాలని ఇప్పటి వరకు ఆయన ఆగారని సమాచారం. ఇప్పుడు చిరు మళ్లీ ఫామ్‌లోకి రావడంతో రామారావు ఆయన్ని సంప్రదించారట. రామారావుతో ఒక సినిమా చేస్తానని గతంలో చిరంజీవి మాటివ్వడంతో ఈ చిత్రాన్ని చేయడానికి ఆయన అంగీకరించారని టాక్. తమిళంలో అజిత్ హీరోగా సూపర్ హిట్ అయిన ‘వేదాళం’ సినిమాను తెలుగులో ఐదేళ్ల తరవాత రీమేక్ చేస్తున్నారు. సుధీర్ఘ విరామం తరవాత డైరెక్టర్ మెహర్ రమేష్ ఈ సినిమా కోసం మళ్లీ మెగా ఫోన్ పడుతున్నారు.

