గాయని, డబ్బింగ్ కళాకారిణి చిన్మయి ‘మీటూ’ ఉద్యమంతో కోలీవుడ్‌లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కొన్ని నెలల క్రితం రాధారవిపై ఒక మహిళ ‘మీటూ’ ఆరోపణలు చేసినప్పుడు.. ఆ విషయాన్ని తన ట్విట్టర్‌లో విడుదల చేశారు చిన్మయి. అలాగే, కవిపేరరసు వైరముత్తుపై వీలు దొరికినప్పుడల్లా ఆరోపణలు చేస్తూనే వున్నారు. ఆ పరిస్థితుల్లో సభ్యత్వ రుసుము చెల్లించలేదన్న కారణంగా డబ్బింగ్ యూనియన్ నుంచి చిన్మయిని తొలగించారు. అప్పుడు రాధారవి ఆ యూనియన్‌కు అధ్యక్షుడిగా వున్నారు. దాదాపు ఏడాదికిపైగా అవకాశాలు వున్న చిన్మయి.. ఆ తరువాత న్యాయపోరాటం చేసి విజయం సాధించారు. దాంతో చిన్మయికి డబ్బింగ్ యూనియన్ సభ్యత్వం ఇవ్వక తప్పలేదు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 15వ తేదీన సినీ డబ్బింగ్ యూనియన్‌కి ఎన్నికలు జరుగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో రాధారవి మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. ఆయనపై పోటీ చేయాలని చిన్మయి నిర్ణయించుకున్నారు. తన మద్దతుదారులతో కలిసి ఆమె గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఒకవేళ నామినేషన్ అంగీకరించకపోతే మళ్లీ న్యాయ పోరాటం చేయాలని చిన్మయి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మరి ఏం జరగబోతోందో చూడాల్సిందే.
previous post


నటనను విమర్శిస్తే ఓకే… కానీ తక్కువ చేసి మాట్లాడారు… తమిళ “అర్జున్ రెడ్డి” కామెంట్స్