telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఉన్నదానితోనే సంతృప్తిగా ఉండు….: జగపతిబాబు

Jagapathi-Babu

విలక్షణమైన నటుడుగా జగపతి బాబు మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఒక అగ్ర హీరోగా తన కెరీర్ లో ఏన్నో విజయాలను సాధించారు అయన. హీరోగా అంతగా పేరు ప్రఖ్యాతలను సంపాదించారో ఒక తండ్రి గా, ఒక విలన్ గా ఏ పాత్రలోనైనా జీవించగల వ్యక్తీ జగపతి బాబు. తెలుగు, తమిళ , మలయాళ , కన్నడ , హిందీ చిత్రాల్లో ఎంతో బిజీగా ఉన్నాడు. తెలుగు సినిమా రంగంలో ఇప్పుడు విలన్ అనగానే వెంటనే గుర్తుకొచ్చే పేరు జగపతి బాబు. గత సంవత్సరం జగపతి బాబు నటించిన రంగస్థలం, అరవింద సమేత వీర రాఘవ సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. హీరోగా ఎంత మంచి పేరును సంపాదించుకున్నారో.. స్టైలిష్ విలన్‌గా అంతకు మించిన పేరును ప్రముఖ నటుడు జగపతిబాబు సంపాదించుకున్నారు. విలన్‌గా ఆయన చేసిన దాదాపు అన్ని సినిమాలూ మంచి కలెక్షన్లను సాధించాయి. అయితే తాజాగా జగ్గూభాయ్ ట్విట్టర్ వేదికగా అభిమానులకు ఓ మంచి మెసేజ్ ఇచ్చారు. వైట్ షర్ట్‌తో స్టైలిష్ లుక్‌తో ఉన్న పిక్‌ను పోస్ట్ చేసిన జగ్గూభాయ్.. “ఇతరుల దగ్గర ఏమున్నది అని చూడకు, నీ దగ్గర ఉన్న దానితో సంతృప్తిగా ఉండు.. ఆ తరువాత నీ లక్ష్యం గొప్పగా ఉండేలా చూసుకో” అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం జగ్గూభాయ్.. అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ‘రాబర్ట్’ సినిమాలో నటిస్తున్నారు.

Related posts