గత కొంతకాలంగా సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి తమిళ ప్రముఖులపై ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వైరముత్తుపై ఆరోపణలు చేసిన ఆమె ఇప్పటికీ న్యాయపోరాటం చేస్తూనే ఉంది. తాజాగా క్షమాపణలు చెబితే ఆమెను డబ్బింగ్ కళాకారులు సంఘంలో స్థానం కల్పిస్తామని సదరు సంఘం అధ్యక్షుడు, సీనియర్ నటుడు రాధారవి తెలిపారు. చెన్నైలో డబ్బింగ్ కళాకారుల సంఘానికి చెందిన ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో రాధారవితో పాటు ఆయనపై ఆరోపణలు చేసిన చిన్మయి కూడా నామినేషన్ వేశారు. కానీ చిన్మయి నామినేషన్ కొన్ని కారణాలతో తిరస్కరణకు గురైంది. దాంతో రాధారవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన పదవులకు ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా.. రాధారవి మాట్లాడుతూ చిన్మయి క్షమాపణలు చెబితే డబ్బింగ్ కళాకారుల సంఘంలో చేర్చుకుంటామని తెలిపారు. అయితే తాను ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణలు చెప్పనని చిన్మయి తెలిపారు.
previous post


ఎక్కడ స్కామ్ ఉంటే అక్కడ నిలుస్తావు.. పీవీపీపై బండ్ల గణేశ్ విమర్శలు