శ్రీశైలంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపుతోంది.
నీలం సంజీవరెడ్డి నిలయం గేటు దగ్గర చిరుత పులి కనిపించింది.
చిరుత పులిని చూసి భక్తులు భయాందోళనకు గురైయ్యారు.
కారు లైట్లు వేయడంతో అడవి ప్రాంతంలోకి చిరుత పులి వెళ్లిపోయింది.
శ్రీశైలంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

