ఏపీలో మరో భవన నిర్మాణ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటుగా స్పందించారు. వైసీపీ సర్కార్ పై ట్విట్టర్ వేదికగా పైనిప్పులు చెరిగారు. పాలకుల బాధ్యతారాహిత్యానికి ఇంకెంత మంది బలి కావాలని ప్రశ్నించారు.
వైసీపీ నేతల ఇసుక దోపిడీ మరో కార్మికుడి ప్రాణాన్ని బలిగొందని ఆవేదన వ్యక్తం చేశారు. పనులు లేక గుంటూరు ఉండవల్లి సెంటర్ లో నాగరాజు అనే తాపీమేస్త్రి ఉరి వేసుకోవడం కలచి వేస్తోందని చెప్పారు. వారం రోజుల వ్యవధిలోనే 10 మంది ప్రాణాలు వదిలారని అన్నారు. ఆదుకోవాల్సిన పాలకులు అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు.