telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఇరాక్ లో ఉన్న… భారతీయులు అప్రమత్తంగా ఉండాలి.. : భారత ప్రభుత్వం

india will not bare anymore is sure

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాక్ లోని భారతీయులు అత్యవసరం అయితే గాని ప్రయాణాలు చేయాలని భారత్ కోరింది. అలాగే ఇరాక్ దేశానికి వెళ్లగోరే ఇండియన్స్ కూడా తమ ప్రయాణాల వాయిదా వేసుకోవడం మంచిదని సూచించింది. ఇరాక్ లోని రెండు అమెరికన్ సైనిక స్థావరాలపై ఇరాన్ మిసైల్ దాడులతో ఉద్రిక్తత రేగగా.. ఇండియా ఈ ‘ ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. ఇరాక్ లో నివసిస్తున్న భారతీయులకు అన్ని సర్వీసులు అందజేసేందుకు బాగ్దాద్ లోని భారత రాయబార కార్యాలయం, అక్కడి ఎర్బిల్ లోని మన దౌత్య కార్యాలయం కూడా మామూలుగానే పని చేస్తున్నాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు.

ఇండియాలోని అన్ని ఎయిర్ లైన్స్.. అప్రమత్తంగా ఉండాలని, ఇరాన్, ఇరాక్, ఒమన్, పర్షియన్ గల్ఫ్ దేశాల వైమానిక గగనతలాల విషయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని డీజీసీఏ కూడా సూచించింది. ఇరాక్ లో అనేకమంది భారతీయులు నిర్మాణ రంగాల్లో పని చేస్తున్న సంగతి విదితమే. ఇరాక్, ఇరాన్ వంటి దేశాల్లో నివసిస్తున్న భారతీయుల భద్రతపై మోదీ ప్రభుత్వం దృష్టి పెట్టాలని పంజాబ్ సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్ కోరారు. గల్ఫ్ దేశాల్లో దాదాపు కోటిమందికి పైగా ఇండియన్స్ నివసిస్తున్నారని, వారు సురక్షితంగా ఉండేలా ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జయశంకర్ ఒక కార్యాచరణ ప్రణాళికతో సిధ్ధంగా ఉండాలని అభ్యర్థిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఇరాన్ బుధవారం మరో డజను బాలిస్టిక్ మిసైళ్లను ఇరాక్ లోని అమెరికన్ సైనిక స్థావరాలపై ప్రయోగించింది.

Related posts