telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

15 ఏళ్ల వయసులోనే నీచంగా… అను మాలిక్ బండారం బయటపెట్టిన మరో సింగర్

Shwetha

గతకొన్ని రోజులుగా మ్యూజిక్ కంపోజర్‌ అను మాలిక్‌పై ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలిచారు సోనా. సింగింగ్ రియాల్టీ షో ఇండియన్ ఐడల్‌కు అను జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఇంతకుముందు ఈ షోకు సోనా కూడా జడ్జ్‌గా వ్యవహరించేవారు. అయితే తన కెరీర్ తొలినాళ్లలో అను తనను లైంగికంగా వేధించాడని సోనా ఏడాది క్రితం ఆరోపణలు చేశారు. దాంతో షో నిర్వాహకులు అనును తొలగించారు. కొంతకాలం తర్వాత సోనాను కూడా తొలగించారు. ఏడాది తర్వాత అనును మళ్లీ షోలోకి ఆహ్వానించి జడ్జ్‌గా కూర్చోబెట్టారు. దీనిపై అసహనం వ్యక్తం చేశారు సోనా. మరో సింగర్ నేహా బాసిన్ కూడా అనూ మాలిక్ పై లైంగిక ఆరోపణలు చేసి సంచలనం సృష్టించారు. ఇప్పుడు అను మాలిక్ మెడకు ఉచ్చు బిగుస్తోంది. తాజాగా మరో గాయని తన గోడును సోషల్ మీడియాలో బయపెట్టింది. శ్వేతా పండిత్. తెలుగులో ‘కొత్త బంగారు లోకం’ సినిమాలోని ‘నేనని నీవని’, ‘పంజా’ సినిమాలోని “ఎలా ఎలా” పాటలను పాడిన శ్వేత.. అను తనతో ఎంత నీచంగా ప్రవర్తించాడో వెల్లడించారు. 1990, 2000ల సమయంలో అను మాలిక్ బాలీవుడ్‌లో పవర్‌ఫుల్ మ్యూజిక్ కంపోజర్. అప్పట్లో వచ్చిన కొత్త వాళ్లంతా అవకాశాల కోసం అను మాలిక్ వద్దకే వెళ్లేవారు. 2001లో శ్వేత తన ట్యాలెంట్ నిరూపించుకోవడానికి అను మాలిక్ ఆఫీస్‌కు వెళ్లిందట. చిన్న పిల్ల అని కూడా చూడకుండా అను మాలిక్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడట. అయితే ఇప్పుడు మీటూ ఉద్యమం చాలా వైరల్ అవుతోంది కాబట్టి శ్వేత తనకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టాలనుకుంది. అయితే ఓ నెటిజన్ శ్వేత గురించి ట్వీట్ చేస్తూ 2001లో తనకు అన్యాయం జరిగినప్పుడు అప్పుడే ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించింది.

దానికి శ్వేత స్పందిస్తూ.. “2019లోనూ బాధితులనే ఎదురు ప్రశ్నలు అడుగుతున్నారు. నేను సింగింగ్ రంగంలోకి వచ్చి 20 ఏళ్లు అవుతోంది. ఇప్పుడు నాకు ఎంతో పేరుంది. అయినా కూడా నన్నే ప్రశ్నిస్తున్నారు. 2015లో నేను స్కూల్‌కి వెళ్లే పిల్లని. ఆ సమయంలో అంటే 15 ఏళ్ల వయసులో నేను ఇలాంటి విషయాలు మాట్లాడి ఉంటే ఏం జరిగి ఉండేదో ఆలోచించండి. ఇప్పుడు మీటూ మొదలైంది కాబట్టి ఆ దేవుడికి ధన్యవాదాలు తెలుపుతున్నాను” అని తెలిపారు. దీనిపై బాధితురాలైన మరో గాయని నేహా భాసిన్ స్పందిస్తూ.. “15 ఏళ్ల వయసులో శ్వేత పండిట్‌ను అను మాలిక్ లైంగికంగా వేధించాడు. అప్పుడు తను చిన్న పిల్ల. ఏం మాట్లాడుతుంది? ఎవరితో చెబుతుంది? ముందు బాధితులను ఎదురు ప్రశ్నలు వేయడం మానుకోవాలి. క్రిమినల్స్‌ని ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనిపై గతంలో అన్ని ఆరోపణలు వచ్చినా ఇప్పటికీ పలు సింగింగ్ షోలకు అను మాలిక్‌ను జడ్జ్‌గా నియమిస్తున్నారు. ఇలాంటి షోలకు సచిన్ టెండూల్కర్ లాంటి సెలబ్రిటీలు సపోర్ట్ చేయడం గమనార్హం.

Related posts