telugu navyamedia
క్రీడలు వార్తలు

కోహ్లీని ఎత్తుకున్న అనుష్క…

అనుష్క శర్మ బుధవారం ఇన్‌స్టాలో పంచుకున్న ఓ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. గతంలో చేసిన ఓ యాడ్ షూట్‌కు సంబందించిన ఘటనను అనుష్క శర్మ తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. సెట్‌లో ఉన్న విరాట్ కోహ్లీని.. వెనుక నుంచి కౌగిలించుకున్నారు అనుష్క. ఆ త‌ర్వాత త‌న భ‌ర్త‌ను ఈజీగా రెండు చేతుల‌తో పైకి లేపారు. అనుష్క లిఫ్టింగ్ స్టంట్స్ చూసిన కోహ్లీ.. ఓ తేరీ అంటూ షాక్ అయ్యాడు. మ‌రోసారి పైకి లేపాలంటూ అనుష్కను కోరాడు. ఎటువంటి హెల్ప్ తీసుకోకుండానే.. మ‌ళ్లీ విరాట్‌ను త‌న చేతుల‌తో బిగించి అనుష్క సునాయాసంగా ఎత్తుకున్నారు. ఆపై అనుష్క యాహూ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఆ వీడియోను పోస్టు చేసిన అనుష్క శర్మ.. ‘ఇది నేనే చేశానా’ అంటూ కామెంట్ పెట్టారు. అనుష్క పెట్టిన కామెంట్‌కు విరాట్ కోహ్లీ కూడా రిప్లై ఇచ్చాడు. ఇక ఆ వీడియోకు అతి త‌క్కువ స‌మ‌యంలోనే తెగ లైక్‌లు వ‌చ్చేశాయి. ఈ వీడియోను వీక్షించిన అభిమానులు ‘సూపర్‌ అనుష్క’, ‘మీ జంట ఎల్లప్పుడూ కలిసి ఉండాలి’, ‘మీరిద్దరూ మాకు ఇలాగే వినోదం పంచుతూ ఉండాలి’ అని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2021 కోసం చెన్నైలో ఉన్నాడు. అనుష్క కూడా కోహ్లీతో అక్కడే ఉన్నారు.

Related posts