వైసీపీ ప్రభుత్వం పై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఏకపక్షంగా అణగదొక్కాలనుకుంటే అది మీ వల్ల కాదంటూ వైసీపీకి సవాల్ విసిరారు. పులివెందుల తరహా పంచాయతీలు ఇక్కడ చేద్దామంటూ కుదరదని హెచ్చరించారు. ఆస్తుల పంపకంలో మాటసాయం చేస్తే కూడా కోడెలపై క్రిమినల్ కేసు పెట్టారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ పేరు చెప్పి ఉద్యోగాలు కల్పిస్తానని డబ్బు వసూలు చేసిన నాగరాజు వంటి వ్యక్తులు ఫిర్యాదు చేస్తే కూడా కోడెలపై కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.అడిగేవారు లేరని ఇష్టానుసారం వ్యవహరిస్తారా? అని ప్రశ్నించారు. నన్నపనేనిపై అనవసరంగా కేసు పెట్టారని మండిపడ్డారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. కోడెలలా అందరూ ఆత్మహత్య చేసుకోవాలని కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు.
రైతు సమస్యల ప్రస్తావనే లేదు.. రాష్ట్రపతి ప్రసంగంపై ఉత్తమ్ విమర్శలు