టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి నేటి తెనాలి పర్యటన వాయిదా పడింది. పట్టణంలో నేడు చంద్రబాబు బహిరంగ సభ జరగాల్సి ఉంది. 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో పర్యటనను వాయిదా వేసినట్టు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెలిపారు.
అమరావతిపై పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామన్నారు. మండలి రద్దు, మారుతున్న పరిణామాల నేపథ్యంలోనే చంద్రబాబు పర్యటనను వాయిదా వేశామని, ఫిబ్రవరి తొలి వారంలో బాబు పర్యటన ఉంటుందని తెలిపారు. అమరావతి సమస్య ఏ ఒక్క పార్టీదీ కాదని, ఇది అందరిదీ అని రాజేంద్రప్రసాద్ వివరించారు.


ఒకరు భయపెడితే సినిమావాళ్లు భయపడరు: మురళీమోహన్