ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు.
అంతకుముందు, ఏపీ బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. శాసనసభలో మంత్రి పయ్యావుల కేశవ్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ను ప్రవేశపెట్టారు. దాదాపు రూ.2.9 లక్షల కోట్లతో బడ్జెట్ ను రూపొందించారు.
బడ్జెట్ అనంతరం అసెంబ్లీ వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది.
అసెంబ్లీని ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై చర్చించనున్నారు.
ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టనున్నారు.
శాసన మండలిలో బడ్జెట్ను కొల్లు రవీంద్ర, వ్యవసాయ బడ్జెట్ను మంత్రి నారాయణ ప్రవేశపెడతారు.