ఓటేయకపోతే సంక్షేమ పథకాలు కట్ చేస్తామని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారు. వైసీపీ నేతలకు సిగ్గుందా, బుద్ది ఉందా.. మీకు ఓట్లేయకపోతే బెదిరిస్తారా అని ప్రశ్నించారు. అమరావతి మహిళలు దుర్గమ్మ గుడికి వెళ్తే కొడతారా… మహిళా దినోత్సవం రోజున జగన్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చే మర్యాద ఇదేనా అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్ని కేసులు పెడతారో పెట్టండి చూస్తా. గుంటూరు ప్రజలకు సిగ్గుంటే వైసీపీ జెండా పట్టుకోరు. గుంటూరు ప్రజలకు రోషం, పౌరుష లేదు. గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు బ్రతికున్న చచ్చినట్లే లెక్క. ఇక్కడ ప్రజలు హైదరాబాద్ పాచీ పని చేయడానికి వెళ్తున్నారు. అలాంటి వారికి ఇక్కడే ఉపాది కల్పించాలని రాజధాని తెచ్చాను. ప్రజల అసమర్దత వల్లే జగన్ మళ్లీ ఓటు అడుగుతున్నాడు. వంట గ్యాస్, పెట్రోల్ ధరలు పెరిగినా మహిళలకు కోపం రావడం రాదు. కరెంట్ తీగ పట్టుకోవద్దని నేను చెప్పిన ప్రజలు విన లేదు. మాచర్లలో నామినేషన్లు కూడా వేయనీయని పరిస్థితి ఓ రౌడీ షీటర్ ను మాచర్ల కు ఛైర్మన్ గా చేస్తున్నారు. ఓట్లు వేయించుకోని జగన్ ముస్లింలను మోసం చేశారు అని తెలిపాడు.
previous post
next post
రాజశేఖరరెడ్డి కూడు పెడితే..జగన్ పొట్ట కొడుతున్నారు: కన్నా