తెలుగు దేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్ర బాబు నాయుడు తన స్వంత నియోజక వర్గం కుప్పంలో పర్యటించినప్పుడు జనం ప్రభంజనంలా వచ్చారు. కుప్పంలో రోడ్లన్నీ జనం తో కిక్కిరిసిపోయాయి. చంద్రబాబును తమ గుండెల్లో పెట్టుకున్న కుప్పం ప్రజలు తమ నాయకుని రాకతో తెలుగుదేశం కార్యకర్తలయి రెట్టించిన ఉత్సాహంతో కదం తొక్కారు.

వాడవాడలా పసుపు జెండా ప్రభంజనమైంది. కుప్పంతో చంద్రబాబుకు ఉన్న అనుబంధం ఏమిటో జనం నిరూపించారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు తన పర్యటనలో మాజీ ప్రజాప్రతినిధులు, టిడిపి నేతల యోగక్షేమాలు తెలుసుకున్నారు.
![]()
జగన్మోహన్ రెడ్డి అధర్మ పాలనపై తాను చేసేది ధర్మపోరాటమని చంద్ర బాబు నాయుడు పేర్కొన్నారు . కుప్పం నియోజకవర్గంలో ఆయన అనేక బహిరంగసభల్లో మాట్లాడారు. తన కుప్పం పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టిస్తోందని మండిపడ్డారు. వైసీపీ అధర్మ పాలనపై తాను చేసేది ధర్మపోరాటమని ఆయన అన్నారు.

కొందరు అధికారులు, పోలీసులు వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. ప్రజల కోసం పనిచేసే పార్టీ టీడీపీ అని ఆయన పేర్కొన్నారు. తనతో కలసి ప్రజలు జగన్ ప్రభుత్వానికి చర్మ గీత పాడాలని చంద్ర బాబు పిలుపునిచ్చారు .


చంద్రబాబును మార్షల్స్ అడ్డుకోవడం దారుణం: నక్కా ఆనంద్ బాబు