telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఆచరణలో బోటు వెలికితీత.. లక్షల్లో ఖర్చు..

team found difficult to bring boat

గోదావరిలో జరిగిన బోటు ప్రమాదం ఘటనలో 33మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. 26మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఇంకా 14మందికిపైగా ఆచూకీ తెలియడం లేదని చెబుతున్నారు. బోటు కింద వారు చిక్కుకుపోయి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బోటును బయటకు తీసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేేసినవా విపలమవుతున్నాయి. విపరీతమైన వర్షాలు, వరద ప్రవాహం, ఇరుకు ప్రాంతం, బోటు 210 అడుగుల లోతులో ఇరుక్కుపోవడం వంటి కారణాలు వెలికితీతకు ఆటంకాలుగా మారుతున్నాయి.

బోటును బయటకు తీసేందుకు స్పెషల్ రెస్క్యూ ఆపరేషన్‌ను ఆదివారం నుంచి రాయల్‌ వశిష్ట ప్రారంభించనున్నారు. ఇందుకోసం రూ.22.70 లక్షల వర్క్‌ ఆర్డర్‌ ఇచ్చినట్టు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి తెలిపారు. బోటును వెలికి తీస్తామని కొంతమంది ముందుకు వచ్చారని.. వారు సలహాలపై కమిటీని ఏర్పాటు చేశామని.. ఆ కమిటీ సూచనతో ఆ బాధ్యతల్ని కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్‌ కంపెనీకి అప్పగించారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొనే వారికి రిస్క్‌ కవరేజ్‌.. భద్రత చర్యలు తీసుకుంటున్నారు. మిస్సైన పర్యాటకుల ఆచూకీ లభించాల్సి ఉంది.. వారి డెత్‌ సర్టిఫికెట్ల జారీ కోసం ప్రత్యేక అనుమతులు ఇచ్చామన్నారు. గోదావరిలో ఇంకా రెస్క్యూ బృందాల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

Related posts