telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

స్టాలిన్ ను సీఎంగా చూడాలనేది తమిళ ప్రజల కోరిక: చంద్రబాబు

Chandrababu comments Jagan cases

స్టాలిన్ ను సీఎంగా చూడాలనేది తమిళ ప్రజల కోరిక అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ నేతలతో కలిసి చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమిళనాడుకు స్టాలిన్ వంటి సమర్థ నాయకత్వం అవసరమని అన్నారు. కరుణానిధి వారసుడుతమిళనాడు అభివృద్ధి కోసం డీఎంకే అధికారంలోకి రావాలని చెప్పారు. ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలని తమిళ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

జల్లికట్టును నిషేధించి తమిళ సంస్కృతిని అవమాన పరిచారని ప్రధాని మోదీపైమండిపడ్డారు. నాడు గజ తుపాన్ తో తమిళనాడుకు తీవ్ర నష్టం వాటిల్లిందని, ఈ రాష్ట్రాన్ని కేంద్రం ఏ మాత్రం ఆదుకోలేదని విమర్శించారు. అన్నా డీఎంకే మోదీ చేతిలో కీలుబొమ్మగా మారిందని, ఆ పార్టీకి ఓటేస్తే మోదీకి వేసినట్టేనని తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సీఎం రమేశ్, కనకమేడల రవీంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related posts