telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నదుల అనుసంధానం చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు: గొట్టిపాటి రవికుమార్

నేడు బాపట్ల జిల్లాలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

అనంతరం మీడియాతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడారు. ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాష్ట్రాన్ని దోచుకునే పార్టీ జగన్దేనని విమర్శించారు.

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఐదేళ్లు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కు తీసుకెళ్లారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు.

కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరి సంపద సృష్టిస్తుందని అన్నారు.

సంక్షేమం, అభివృద్ధి టీడీపీ కి రెండు కళ్లు అని ఉద్ఘాటించారు. దేశంలో నదులు అనుసంధానం చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు ఒక్కరేనని గుర్తుచేశారు.

దేశంలో కోటి సభ్యత్వాలు ఉన్న ఘనత టీడీపీకే దక్కుతుందని తెలిపారు. రూ.33 వేల కోట్ల పెన్షన్లను తమ ప్రభుత్వలో అందిస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.

Related posts