టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నుంచి విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి చంద్రమౌళిపై 29993 ఓట్ల మెజార్టీతో చంద్రబాబు గెలుపొందారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతో పోటీ ఉంటుందనుకున్న నేపథ్యంలో వార వన్ సైడ్ అయింది. టీడీపీ అనూహ్యరీతిలో బాగా వెనుకబడిపోగా వైసీపీ ముందంజ వేసింది. ఓట్ల లెక్కింపు మొదలైన కాసేపటివరకు చంద్రబాబు వెనుకంజలో ఉండడం టీడీపీ వర్గాలను ఆందోళనకు గురిచేసింది.
తదుపరి రౌండ్లలో పుంజుకోవడమే కాకుండా చివరికి చంద్రబాబు విజయం సాధించారు. ప్రస్తుతం కుప్పంలో టీడీపీ గెలుపొందగా.. తిరుపతిలో ఆధిక్యంలో ఉంది. చిత్తూరు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలున్నాయి. 14 స్థానాల్లో 12 స్థానాల్లో వైసీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. రాష్టవ్యాప్తంగా విడుదలైన ఫలితాల్లో వైసీపీ 137 స్థానాల్లో, టీడీపీ 27 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

