telugu navyamedia
రాజకీయ

జనసేన-బీఎస్పీ పొత్తు ఒక పొలిటికల్ స్టంట్: ఎంపీ కవిత

MP Kavitha comments BBP Govt.
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన-బీఎస్పీ పొత్తుపై టీఆర్ఎస్ నేత, నిజామాబాద్ లోక్ సభ సభ్యురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. ఏపీ, తెలంగాణ ఎన్నికల్లో బీఎస్పీ-జనసేన పొత్తు పెట్టుకోవడం ఒక పొలిటికల్ స్టంట్ అని కవిత వ్యాఖ్యానించారు.  జనసేన – బీఎస్పీ కలిసి స్వతంత్రంగా పోటీ చేస్తున్నారా? లేక వారు చంద్రబాబుతో కలిసి పోటీ చేస్తున్నారా? అనేది తేలాల్సి ఉందన్నారు. ఈ విషయంలో ప్రజలకు స్పష్టత ఇవ్వాలని  కవిత డిమాండ్ చేశారు.

Related posts