telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బహుముఖ ప్రజ్ఞాశాలి ఎస్పీ బాలుకు ప్రముఖుల సంతాపం

SPB

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఈరోజు మధ్యాహ్నం 1.04 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆసుపత్రి వద్దకు బాలు కుటుంబసభ్యులు, బంధువులు చేరుకుంటున్నారు. ప్రస్తుతం బాలు ఉన్న ఎంజీఎం ఆసుపత్రి వద్దకు పెద్ద సంఖ్యలో సినీ, రాజకీయ ప్రముఖులు వస్తున్నారు. ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున మీడియా ప్రతినిధులు, పోలీసులు చేరుకున్నారు. దిగ్గజ సంగీత దర్శకుడు బాలుకు సోషల్ మీడియా ద్వారా నివాళులు అర్పిస్తున్నారు. ఈరోజు సాయంత్రం ఆయన అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది.

Related posts