96.9 శాతం తెలంగాణ కుటుంబాలను కేవలం 50 రోజుల్లోనే పూర్తి చేసిన అతిపెద్ద సామాజిక-ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల (సీఈఈపీసీ) సర్వేను విజయవంతంగా పూర్తి చేసి తెలంగాణ చరిత్ర సృష్టించిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.
కేబినెట్‌లో తీర్మానం చేయడం నుంచి నివేదిక సమర్పించే వరకు మొత్తం ప్రక్రియను సరిగ్గా ఏడాది వ్యవధిలో పూర్తి చేశామన్నారు.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన ప్రధాన వాగ్దానాన్ని నెరవేర్చడం ద్వారా డేటా ఆధారిత పాలన దిశగా ఈ సర్వే ముఖ్యమైన ముందడుగు వేసినట్లు మంత్రి తెలిపారు.
ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ టైమ్ సామాజిక-ఆర్థిక డేటా ఆధారంగా సంక్షేమ విధానాలకు పునాది వేశారని అన్నారు.
నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం, భారీ సమాచార సేకరణ కసరత్తుకు నాయకత్వం వహించిన ప్రణాళికా విభాగం నుంచి అధికారికంగా సర్వే నివేదికలను స్వీకరించింది.
ఉన్నత స్థాయి సమావేశంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డి.సీతక్క, పొన్నంప్రభాకర్, దామోదర్ రాజ నరసింహ, ప్రిన్సిపల్ సెక్రటరీ (ప్లానింగ్) సందీప్ కుమార్ సుల్తానియా, రాష్ట్ర నోడల్ అధికారి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్‌దురిశెట్టి, ఇతర ఉన్నతాధికారుల నుంచి సర్వే నివేదికలను స్వీకరించారు.
ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ మెథడాలజీ మరియు అన్వేషణలపై వివరణాత్మక పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ చేసింది.
అనంతరం ఆదివారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ సరిగ్గా ఏడాది క్రితం అంటే 2024 ఫిబ్రవరి 4న తెలంగాణ కేబినెట్ ఈ సర్వేను ఆమోదిస్తూ తీర్మానం చేసిందని, ఈరోజు పూర్తి చేసిన నివేదిక మైలురాయిగా నిలిచిందన్నారు.
ఫిబ్రవరి 4న ఉదయం 10 గంటలకు కేబినెట్ ముందు నివేదికలు అందజేస్తామని, అదే రోజు అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ ఉంటుందని ఆయన ప్రకటించారు.
తెలంగాణ సంక్షేమ కార్యక్రమాలను పునర్నిర్మించేందుకు వనరులను సమంగా పంపిణీ చేసేందుకు ఈ ఫలితాలు ఉపయోగపడతాయని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.