తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో కరోనా కేసులు 3 లక్షలు దాటేశాయి. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 535 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇక ముగ్గురు కరోనాతో మృతిచెందారు.. ఇదే సమయంలో 278 మంది కరోనా బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 3,06,339 కు చేరగా.. రికవరీ కేసులు 3,00,156 కు పెరిగాయి.. మరోవైపు.. ఇప్పటి వరకు కరోనాబారినపడి 1,688 మంది మృతి చెందారు. ఇక అటు యాదాద్రి టెంపుల్ లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. నిన్నటి వరకు యాదాద్రి టెంపుల్ సిబ్బందిలో 36 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇక ఈరోజు ఇప్పటికే 26 మందికి కరోనా నిర్దారణ కాగా.. అందులో అర్చకులు, సిబ్బంది, జర్నలిస్టులు కోవిడ్ బారిన పడ్డారు. ఇంకా యాదాద్రిలో కోవిడ్ నిర్దారణ పరీక్షలు కొనసాగుతున్నాయి. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న వారిలో ఆందోళన మొదలైంది. అయితే.. కోవిడ్ బారిన పడిన వారిలో ఎక్కువగా అర్చకులు, టెంపుల్ సిబ్బంది ఉండటంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు.


చైనాకు తగిన శాస్తి జరగాలి: మధ్యప్రదేశ్ సీఎం