కరీంనగర్ జిల్లాలోని చిన్న మల్కనూరు వద్ద వ్యవసాయ బావిలోకి కారు దూసుకెళ్లింది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు కారును బయటకు తీసేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారు. కరీంనగర్ నుండి కారు హుస్నాబాద్ వెళ్తుండగా చిన్న ముల్కనూరు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుందని వివరించారు. ఆ కారులో ఐదుగురు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కారు బావిలో పడి అప్పటికే చాలా సమయం కావడంతో వారి పరిస్థితిపై ఆందోళన నెలకొంది. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
previous post
next post


అక్రమ సంపాదన కోసం కేసీఆర్ అడ్డదారులు: బండి సంజయ్