telugu navyamedia
CBN రాజకీయ వార్తలు

నేడు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగనుంది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో ఇవాళ కేబినెట్ సమావేశం జరుగనుంది.

ఈ భేటీలో సుమారు 30 అంశాల ఎజెండాగా కేబినెట్ చర్చించనుంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించే పలు బిల్లులు, చట్ట సవరణలకు ఆమోదం తెలపనుంది మంత్రివర్గం. ఆతిథ్య హోటళ్లకు ప్రోత్సాహకాలు ఇచ్చే అంశంపై చర్చించి ఓ నిర్ణయం తీసుకోనుంది కేబినెట్.

సత్యసాయి, నంద్యాల, కడప, అనంతపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో సంప్రదాయేతర ఇంధన వనరుల ప్రాజెక్టుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది మంత్రివర్గం.

ఉమ్మడి కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో గతేడాది వరద ముంపు మరమ్మతులకు గానూ దాదాపు రూ.57.14 కోట్లు మంజూరుకు ఆమోదం తెలపనుంది.

ఎస్సీ, ఎస్టీ చట్టంలోని పలు సవరణలను ఆమోదించనుంది. వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై చర్చించనుంది.

కుప్పంలో దాదాపు రూ.586 కోట్ల పెట్టుబడితో హిందాల్ పరిశ్రమ ఏర్పాటుపై మంత్రి మండలి ఓ నిర్ణయం తీసుకోనుంది.

ఈ పరిశ్రమ ద్వారా దాదాపు 613 మందికి ఉద్యోగ అవకాశాలను ఏపీ ప్రభుత్వం కల్పించనుంది.

Related posts