కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీ బుట్టా రేణుక ప్రచారానికి రాకూడదని, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి తేల్చిచెప్పారు. దీంతో వీరిద్దరి మధ్య నెలకొన్న విభేదాలు బయటపడ్డాయి. మ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 90 వేలకుపైగా చేనేత ఓటర్లు ఉన్నారు. ఆదివారం రాత్రి అక్కడి మాచాని సోమప్ప మెమోరియల్ హాలులో చేనేత, బీసీ కులాల ఆత్మీయ సమావేశం జరిగింది. వైసీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ సంజీవ్‌కుమార్, చెన్నకేశవరెడ్డి హాజరయ్యారు.
కేశవరెడ్డి మాట్లాడుతుండగా బుట్టా అభిమానులు అడ్డుతగిలారు. రేణుకను ప్రచారానికి ఎందుకు రావొద్దన్నారని నిలదీశారు. ఆయన వారికి సర్దిచెప్పకుండా మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఆమె ఎంపీగా గెలిచాక ఐదేళ్లలో ఎమ్మిగనూరు నియోజకవర్గానికి ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని, నాగులదిన్నె గ్రామాన్ని దత్తత తీసుకుని గజం సిమెంటు రోడ్డు కూడా వేయలేదని, ఆమెను ఎందుకు ప్రచారానికి పిలవాలని ఎదురుదాడికి దిగారు.
ఈ నెల 18న 20 వేల మంది బీజేపీలో చేరుతారు: లక్ష్మణ్