ప్రముఖ రచయిత డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో హీరో ఆది సాయికుమార్ హీరోగా తెరకెక్కిన చిత్రం “బుర్రకథ”. ఈ చిత్రంలో , హీరోయిన్లు మిస్త్రీ చక్రవర్తి, నైరాశా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాగా… యూ/ఏ సర్టిఫికెట్ లభించింది. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో అట్టహాసంగా జరిగింది. కార్యక్రమంలోఈ చిత్ర దర్శకుడు డైమండ్ రత్నబాబు, హీరో ఆది సాయికుమార్, డైలాగ్ కింగ్ సాయి కుమార్, నటకిరిటీ డా. రాజేంద్రప్రసాద్, నిర్మాతలు శ్రీకాంత్ దీపాల, కిరణ్ రెడ్డి, సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్తో పాటు ప్రముఖ దర్శకుడు విజయేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ “ఈ ‘బుర్రకథ’ చిత్రంలో మంచి కథ, డైలాగ్స్ ఉన్నాయి. ఒక మనిషికి రెండు మెదడులు ఉంటే ఎలాంటి పరిణామాలు జరుగుతాయనేదే ఈ చిత్ర కథాంశం. ఈ కథను దర్శకుడు డైమండ్ రత్నం చాలా ఇంట్రెస్టింగ్, ఎంటర్టైనింగ్‌గా తెరకెక్కించారు. రచయితగా ఉన్న రత్నం.. మంచి ప్రయత్నం చేశాడు. సాయికుమార్ నాకు చాలా సన్నిహితుడు, ఆయన కుమారుడు ఆది ఈ సినిమాలో అద్భుతంగా నటించారు. రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది నటనని చూసి ఆశ్చర్యపోయా. ఇది వండర్ ఫుల్ స్టోరీ.. బుర్రపెట్టి సినిమాను చూసి ఆదరించండి” అని అన్నారు.
ఈ సందర్భంగా హీరో ఆది సాయి కుమార్ మాట్లాడుతూ “రాజేంద్రప్రసాద్ గారితో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. ఆయన్నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారు.వెంకటేష్ గారు ట్రైలర్ లాంచ్ చేశారు.నాని, సాయి తేజ్, సందీప్ కిషన్, సుధీర్ బాబు అందరు హీరోలు సపోర్ట్ చేశారు. వారికి కృత్ఞతలు” అన్నారు.
దర్శకుడు డైమండ్ రత్నబాబు మాట్లాడుతూ “ఒక మనిషికి రెండు బ్రెయిన్స్ ఉంటే ఆ మనిషి తీరు, ఎదుర్కున్న సమ్యస్యలేంటి అన్నది ఎంటర్టైనింగ్ గా చెప్పాం. ఎమోషనల్ గా కూడా ఉంటుంది. జూలై 5 న విడుదల అవుతున్న బుర్రకథ అందరికీ నచ్చే సినిమా అవుతుంది” అన్నారు.
డైలాగ్ కింగ్ సాయి కుమార్ మాట్లాడుతూ “విజయేంద్ర ప్రసాద్ గారు రావడం పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగిస్తున్నాయి. హిట్ సినిమాతో వస్తున్నా అని డైమండ్ రత్నం చెప్పాడు చెప్పినట్టే సినిమా తీశాడు. ఆది చాలా కష్టపడ్డాడు. ఆ కష్టం రేపు సినిమాలో చూస్తారు. బుర్రకథ అందరికి మంచి పేరు తెస్తుంది” అన్నారు.
నిర్మాతను శ్రీకాంత్ దీపాల మాట్లాడుతూ “మంచి కథతో వస్తున్నాం. ప్రేక్షకులు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు.ఆది ఈ సినిమాలో చాలా అందంగా కనిపిస్తారు. అందరి ప్రోత్సాహంతో జూలై 5న వస్తున్నాం. ప్రతి టెక్నీషియన్ కి పేరు పేరునా ధన్యవాదాలు” అన్నారు.
నిర్మాత కిరణ్ రెడ్డి మాట్లాడుతూ “ఈ రోజు డైమండ్ రత్నబాబు గారిని చూసినప్పుడు సినిమా విజయం సాధిస్తుందని అర్థమైపోయింది. బుర్రకథ సూపర్ హిట్ అవుతుంది. జూలై 5న అందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.
అమితాబ్ తో రిలేషన్ గురించి రేఖ కామెంట్స్