telugu navyamedia
సినిమా వార్తలు

బన్నీ రికార్డు బ్రేక్ చేసిన రౌడీ బాయ్‌..

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ న‌టించిన సినిమాలు త‌క్కువే అయిన ఇండస్ట్రీ లో ఆయ‌న ఉన్నంత యూత్‌ ఫాలోయింగ్ ఎవ‌రికీ ఉండ‌దు. త‌క్కువ స‌మ‌యంలోనే మంచి పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ తాజాగా అల్లు అర్జున్ రికార్డును బద్దలు కొట్టాడు.

Vijay Devarakonda interview

అర్జున్ రెడ్డి, ‘గీతా గోవిందం లాంటి మూవీ తో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయిన విజయ్ దేవరకొండకి కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో మాత్రమే కాదు మిగిలిన ఇండస్ట్రీస్ లో కూడా బాగా క్రేజ్ ఉంది. అలాగే విజయ్ దేవరకొండకు సినిమాలోనే కాదు సోషల్ మీడియాలో కూడా ఫాలోయింగ్ త‌క్కువేమి కాదు. విజయ్ కి టైమ్ దొరికినప్పుడల్లా తన ఫాలోవర్లతో ముచ్చట పెడుతుంటాడు.

Vijay Deverakonda All Films Hit Flop Box Office verdict - BollywoodFever

ఈ క్రమంలో ఇన్స్టాగ్రామ్ లో అతి తక్కువ సమయంలో 13 మిలియన్ల ఫాలోవర్స్ సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించాడు. సౌత్ ఇండియాలో చాలా మంది హీరోలు ఇన్స్టాగ్రామ్ లో కోట్ల మంది ఫాలోవర్లను సంపాదించుకుంటున్నారు. ఇటీవల అల్లు అర్జున్ 13 మిలియన్ల ఫాలోవర్లను రీచ్ అయ్యాడు. దీంతో సౌత్ లో ఈ రికార్డ్ అందుకున్న తొలి హీరోగా బన్నీ పేరు నమోదు కాగా.. కొద్దిరోజులకే విజయ్ దేవరకొండ బన్నీ సాధించిన రికార్డు ను బ్రేక్ చేసారు.దీంతో సోషల్ మీడియాలో విజయ్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు.

Vijay Devarakonda's PDA on Puri Jagannath

ప్రస్తుతానికి విజయ్.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఛార్మి, పూరి జగన్నాథ్, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది.

Related posts