telugu navyamedia
రాజకీయ వార్తలు

అమిత్ షా ప్రవేశపెట్టిన బిల్లులకు మమతా మద్దతు!

BJP compliant EC West Bengal

జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను పొడగించే తీర్మానాన్ని ఇప్పటికే కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. రాష్ట్ర‌ప‌తి పాల‌న‌ను ఆర్నెళ్లు పొడిగించాల‌న్న బిల్లును ఇవాళ రాజ్య‌స‌భ‌లోకేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్ర‌వేశ‌పెట్టారు. ఈ బిల్లు పై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ బిల్లుతో ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలల పాటు పొడిగించే బిల్లును కేంద్ర హోంమంత్రి రాజ్యసభలో ఈరోజు ప్రవేశపెట్టారు.

ఈ బిల్లులకు మద్దతు ప్రకటించాలని మమతాబెనర్జీ పార్టీ టీఎంసీ నిర్ణయించింది. మరోవైపు, జమ్ముకశ్మీర్ లో రాష్ట్రపతి పాలన పొడిగింపు బిల్లుకు తాము మద్దతు పలుకుతున్నట్టు సమాజ్ వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు రామ్ గోపాల్ యాదవ్ సభలో ప్రకటించారు. మరోవైపు ఈ బిల్లుకు సమాజ్‌వాదీ పార్టీ మద్దతు తెలుపగా, కాంగ్రెస్‌ పార్టీ మాత్రం వ్యతిరేకిస్తోంది. రంజాన్‌ పండుగ, అమర్‌నాథ్‌ యాత్ర వంటి సాకులతో జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయడం సరికాదని కాంగ్రెస్‌ ఎంపీ విప్లవ్‌ ఠాకూర్‌ కేంద్రం తీరును తప్పుబట్టారు.

Related posts