తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా కొద్ది.. మాటలే కాదు.. దాడుల వరకు వెళ్లింది వ్యవహారం.. ఇక, తృణమూల్ నేతలను టార్గెట్ చేసి మరీ పార్టీలోకి లాగేస్తోంది బీజేపీ.. అధికారంలోకి రావడానికి ఉన్న అన్ని అవకాశాలను బీజేపీ వాడుకుంటుందని.. చివరకు బీఎస్ఎఫ్ బలగాలను కూడా ఉపయోగిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఇక, ఈ వ్యవహారాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు బెంగాల్ మంత్రులు, తృణమూల్ నేతలు.. సరిహద్దుల్లో నివసిస్తున్న ప్రజలను బీజేపీకి ఓటేయాలని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) బలగాలు బెదిరిస్తున్నాయని ఆరోపించారు మంత్రి ఫిర్హాద్ హకీం.. ఎన్నికల సంఘం అధికారులను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. బీఎస్ఎఫ్ బలగాలతో సరిహద్దుల్లోని ప్రజలను తమకు ఓటేయాలని బీజేపీ బెదిరింపులకు పాల్పడుతుందంటూ సంచలన ఆరోపణలు చేశారు.. ఓటర్ లిస్టులో ఉన్నవారిని బంగ్లాదేశీయులని, రోహింగ్యాలని వేధిస్తున్నారని.. ఇది ఓటరు జాబితాను తయారుచేసిన ఈసీని తప్పుబట్టడమే అవుతుందన్నారు. అంతేకాకుండా.. కులాలు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా బీజేపీ నేతలు పనిచేస్తున్నారని విమర్శించారు.
previous post
టీడీపీ ఎంపీల వ్యవహారంపై ఘాటుగా స్పందించిన చంద్రబాబు!