telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హుజుర్‌నగర్‌ ఉపఎన్నిక : .. తెరాస కు మద్దతుగా .. వైసీపీ అడుగులు ..

cm jagan and KCr

ఈ ఉపఎన్నికలలో తెరాస కు వైసీపీ మద్దతు తెలిపింది. తెలంగాణ వైసీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డిని ఉప ఎన్నిక ఇంఛార్జ్‌ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి కలిసి మద్దతు కోరారు. సానుకూలంగా స్పందించిన శ్రీకాంత్‌ రెడ్డి టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించారు. ఇప్పటికే టీఆర్ఎస్ కు సీపీఐ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. టీజేఎస్ కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించింది. టీడీపీ, బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ ఉంది. ఇక సీపీఎం అభ్యర్థి శేఖర్ రావు నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. దీంతో ఉప ఎన్నికల్లో కామ్రేడ్లు పోటీకి దూరమయ్యారు.

మొత్తం 31 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. అనంతరం మరో ముగ్గురు స్వతంత్ర అభ్యర్ధులు తమ నామినేషన్లను ఉపసంహరించున్నారు. చివరకు 28 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. అక్టోబర్ 21వ తేదీన హుజూర్ నగర్ ఉప ఎన్నికలు జరుగనున్నాయి. అక్టోబర్ 24వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. రాజకీయ పార్టీలు ఎవరికివారే గెలుస్తామనే ధీమాలో ఉన్నారు. ఉప ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Related posts