telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

43 ఏళ్ల క్రితం రూ.7.25 కోట్లు… “బాహుబలి” కంటే ఎక్కువ : అమితాబ్

Amitab

బాలీవుడ్ దిగ్గజాలు అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా, రిషి కపూర్ కలిసి నటించిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమా విడుదలై 43 ఏళ్లు పూర్తైంది. ఈ చిత్రం అఖండ విజయాన్ని సాధించింది. ఈ సందర్బంగా అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘బాహుబలి: ది కన్ క్లూజన్’ కంటే ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ఎక్కువ వసూళ్లను రాబట్టిందని అన్నారు. 43 ఏళ్ల క్రితం ఆ రోజుల్లోనే ఈ చిత్రం రూ. 7.25 కోట్లను రాబట్టిందని చెప్పారు. అన్ని విధాలుగా లెక్కిస్తే ‘బాహుబలి-2’ కంటే ఇదే ఎక్కువని అన్నారు. ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ముంబైలో 25 థియేటర్లలో 25 వారాల పాటు ఆడిందని… ఇప్పుడు ఏ చిత్రం అన్ని రోజులు ఆడటం లేదని చెప్పారు. సినిమా విశ్లేషకుల లెక్కల ప్రకారం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమా వసూళ్లు రూ. 7.25 కోట్లు అయినప్పుడు… అప్పట్లో టికెట్ విలువ రూ. 2 అనుకుంటే… మొత్తం 3,62,50,000 మంది చూసినట్టవుతుంది. ఈ ప్రేక్షకుల సంఖ్యను ‘బాహుబలి-2’ విడుదల నాటి టికెట్ ధర రూ. 150తో లెక్కిస్తే… మొత్తం రూ.543 కోట్లు వసూలు చేసినట్టు లెక్క. ‘బాహుబలి-2’ చిత్రం ఇండియాలో రూ. 510 కోట్లు రాబట్టింది.

Related posts